రియాల్టీ, బ్యాంకింగ్‌ దన్ను: రోజంతా హుషారే

26 Apr, 2021 15:56 IST|Sakshi

 రియాల్టీ,బ్యాంకింగ్‌  షేర్లలో లాభాలు

పటిష్టంగా సెన్సెక్స్‌, నిఫ్టీ

 హెచ్‌సీఎల్‌టెక్‌కు  ఫలితాల షాక్‌

సాక్షి, ముంబై: ఆరంభంలోనే లాభాలతో మురిపించిన స్టాక్‌మార్కెట్‌  రోజంతా పటిష్టంగానే కదిలింది. ఆరంభం లాభాలనుంచి మరింత  ఎగిసిన సెన్సెక్స్‌  ఒక  దశలో 700 పాయింట్ల మేర ఎగిసింది. చివరకు 508 పాయింట్ల లాభంతో 48,387వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు ఎగిసి 14,485 వద్ద ముగిసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, రియాల్టీ రంగ షేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్‌, యాక్సిస్‌,  అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిం, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌  టాప్‌ విన్నర్స్‌గా నిలవగా సిప్లా, బ్రిటానియా,హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మ నష్టపోయాయి. అటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల దన్నుతో దేశీయ కరెన్సీ కూడా పుంజుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 24 పైసలు పెరిగి 74.77 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు