జీడీపీ ఊతం : దుమ్మురేపుతున్న మార్కెట్లు

1 Mar, 2021 10:33 IST|Sakshi

మెప్పించిన జీడీపీ  భారీ లాభాలు

900 పాయింట్లకు పైగా  ఎగిసి, 50 ఎగువకు సెన్సెక్స్‌

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి.సోమవారం ఆరంభంలోనే దూకుడు మీదున్నకీలక సూచీలు ఆ తరువాత కూడా తమ హవా   కొనసాగిస్తున్నాయి. ఆసియా మార్కెట్లన్నీ పాజిటివ్‌ సంకేతాలతోపాటు, జీడీపీ  నంబర్లు మార్కెట్లని మెప్పించడంతో సెన్సెక్స్‌  ఏకంగా 900 పాయింట్లు జంప్ చేసింది.  తద్వారా సెన్సెక్స్‌ తిరిగి 50 వేల ఎగువకుచేరింది. నిఫ్టీ 238 పాయింట్లుఎగిసి 14766 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంక్ కూడా జోరుగా ట్రేడ్‌ అవుతోంది. ఆటో ,ఐటీ,బ్యాంకింగ్‌,  సహా అన్ని రంగాల్లోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది.  దీంతో పాటు మీడియా, ఫైనాన్స్‌ ఆయిల్‌ రంగ షేర్ల లాభాలు మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి.  ఓఎన్‌జీసీ,  ఐఓసి  పవర్ గ్రిడ్ కార్పొరేషన్ , యూపిఎల్ కోల్ఇండియా  లాభపడుతుండగా, భారతి ఎయిర్‌టెల్, హిందాల్కో నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు