సెన్సెక్స్‌ హై జంప్‌, 15850కి పైన  నిఫ్టీ

30 Jun, 2022 09:40 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అనంతరం ట్రేడర్ల కొనుగోళ్లతో పుంజుకున్నప్పటికీ ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకుల మధ్య  ఒడిదుడుకులనెదుర్కొన్నాయి.   ప్రస్తుతం సెన్సెక్స్‌ 213 పాయింట్లు ఎగిసి 53240 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 15856 వద్ద కొనసాగుతున్నాయి.  

ఆటో మినహా దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా  ఇంధనం,  మెటల్, ఎనర్జీ, ఐటీ, బ్యాంక్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.   ఫలితంగా  వరుస రెండు రోజుల నష్టాలనుంచి బాగా కోలుకుని కీలక మద్దతు స్థాయిలను సునాయాసంగా అధిగమించాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 53200, నిఫ్టీ 15850కి ఎగువకు చేరాయి. రిలయన్స్‌, పవర్‌ గ్రిడ్‌, బ్రిటానియా, టాటామోటార్స్‌, అదానీ పోర్ట్స్‌ లాభపడుతుండగా, బజాజ్‌ఆటో,  సిప్లా, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ నష్ట పోతున్నాయి. 

మరిన్ని వార్తలు