లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు

6 May, 2021 10:36 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.  ఆరంభంలో 100 పాయింట్లు  ఎగిసిన సూచీలు  లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.   ప్రస్తుతం సెన్సెక్స్‌  28 పాయింట్లు క్షీణించి  48655 వద్ద,నిఫ్టీ 8 పాయింట్లు పుంజుఉని 14626 వద్ద కొనసాగుతున్నాయి.  బ్యాంక్ నిఫ్టీ , ఐటీ  నష్టాల్లోనే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్, కన్జ్యూమర్ డ్యూరబుల్, మెటల్ స్టాక్స్  లాభాల్లోనూ ట్రేడ్‌ అవుతున్నాయి. మెటల్,  ఆటో, ఎఫ్ఎంసిజి, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్లు ధోరణి కనిపిస్తోంది.  ముఖ్యంగా  క్యు4 ఫలితాల జోరుతో ఉన్న టాటా స్టీల్  మరో సారి 52 వారాల గరిష్టాన్ని సృష్టించింది. దాదాపు 5శాతం ఎగసింది. ఇంకా  సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ , ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్  లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు యుపిఎల్, పవర్ గ్రిడ్, శ్రీ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్‌ నష్టపోతున్నాయి.

చదవండి: కరోనా థర్డ్‌ వేవ్‌ తప్పదు: సంచలన హెచ్చరికలు
కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె
కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు 

మరిన్ని వార్తలు