వరుస లాభాలు, బ్యాంకింగ్‌ షైనింగ్‌

22 Jul, 2022 10:18 IST|Sakshi

సాక్షి, ముంబై: భారతీయ స్టాక్‌మార్కెట్లు  వరుసగా  గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలతో  సెన్సెక్స్‌ శుక్రవారం 200 పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్ 233 పాయింట్లు ఎగిసి 55,915 నిఫ్టీ 72 పాయింట్లు లాభంతో 16,678  మొదలైంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 95 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. 

బ్యాంక్, ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్  లాభపడుతున్నాయి. యూపీఎల్‌, ఐషర్ మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ , కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్‌లలో ఉన్నాయి. ఎల్‌ఐసీ కూడా లాభాల్లోనే ఉంది. 

 అటు ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, విప్రో, అపోలో హాస్పిటల్స్‌ లాభపడుతున్నాయి.   మరోవైపు డాలరు మారకంలో రూపాయి కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. 6 పైసల లాభంతో  79.90 వద్ద కొనసాగుతోంది. గురువారం 80.06 ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకిన సంగతి  తె లిసిందే. 
 

మరిన్ని వార్తలు