గ్లోబల్‌ సంకేతాలు: లాభాల్లో స్టాక్‌మార్కెట్‌..అయినా

26 May, 2022 09:49 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య ఇండియన్‌ మార్కెట్లు గురువారం ఓపెనింగ్‌లో లాభాల శుభారంభాన్ని చేశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు  ఎగిసి 54,053 వద్దకు చేరుకోగా  ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 85 పాయింట్లు ఎగబాకి 16,111 వద్ద ట్రేడయింది.  కానీ  ఎఫ్‌ అండ్‌వో ఎక్స్‌పైరీ  కావడంతో  ట్రేడర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్‌ 54 దిగువకు చేరింది. 

బ్యాంక్, ఫైనాన్షియల్‌ ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ భారీ లాభాల్లో   కొనసాగుతుండగా,  ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, నెస్లే ఇండియా, హిందాల్కో, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా టాప్ గెయినర్‌లలో ఉన్నాయి.

మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం సెన్సెక్స్ 303 పాయింట్లు క్షీణించి,53,749 వద్ద , నిఫ్టీ 99 పాయింట్లు  నష్టంతో 16,026 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు