ఆర్‌బీఐ బూస్ట్‌: మార్కెట్లు జంప్‌

5 May, 2021 15:18 IST|Sakshi

ఫార్మాకు ఆర్‌బీఐ జోరు

14600  ఎగువన నిఫ్టీ ముగింపు

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో తోడు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడు తారన్న అంచనా మధ్య లాభాలతో ట్రేడింగ్‌ను ఆరభించాయి. భారీ ఉపశమన ప్యాకేజీ లభించనుందన్న ఆశలు ఇన్వెస్టర్లనను ఊరించాయి.  కానీ అలాంటి చర్యలేవీ  శక్తికాంత దాస్‌ ప్రకటించలేదు. అయితే కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ఫార్మాకు ఊరట లభించడంతో ఫార్మ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇంకా బ్యాంకింగ్‌, ఆయిల్‌ ,  ఐటీ రంగ లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. చివరకు సెన్సెక్స్‌  424 పాయింట్లు ఎగిసి48677  వద్ద, నిఫ్టీ 121పాయింట్ల  లాభంతో 14617 వద్ద ముగిసాయి. తద్వారా సెన్సెక్స్‌ 48600 ఎగువన, నిఫ్టీ 14600 ఎగువన ముగియడం విశేషం 

లుపిన్‌ 14 శాతం, 6 శాతం పుంజుకుని సన్ ఫార్మా టాప్‌ గెయినర్స్‌గా ఉండగా, ఇంకా అరబిందో, క్యాడిల్లా,  యుపిఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో, భారతి ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ఒఎన్‌జిసి, దివిస్ ల్యాబ్స్, టిసిఎస్, టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా లాభపడ్డాయి.  మరోవైపు  అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎస్‌బిఐ లైఫ్ ఎల్‌ అండ్‌డీ , ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి.

చదవండి : 2022 సెకండ్‌ ఆఫ్‌కి అందరికీ టీకాలు: ఆర్‌బీఐ గవర్నర్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు