బ్యాంకింగ్‌ జోరు, లాభాల్లో సూచీలు

26 Mar, 2021 10:48 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. శుక్రవారం ఆరంభంలోనే ఉత్సాహాన్ని ప్రదర్శించిన కీలక  సూచీలు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి.  కింది స్థాయిల్లో ట్రేడర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్‌ 500 పాయింట్లు ఎగిసి 48944 వద్ద,నిఫ్టీ 163 పాయింట్లు లాభంతో 14488 వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి.  దాదాపు అన్ని రంగాల షేర్లలోను కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. బ్యాంక్,ఆటో,మెటల్స్, ఎఫ్ఎంసిజీ,స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ అన్నీ పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి.  రెండు రోజుల  నష్టాలనుంచి కోలుకుని నిఫ్టీ 14,500 స్థాయి వద్ద కదలాడుతోంది. బెంచ్‌మార్క్‌లు ఓవర్‌సోల్డ్ జోన్‌లోకి వెళ్లి, షార్ట్ కవరింగ్ కారణంగా బౌన్స్ బ్యాక్‌ అయ్యాయని నిపుణుల విశ్లేషణ. బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటర్స్, హిందాల్కో, ఎం అండ్ ఎం, గెయిల్ స్టాక్స్  లాభాల్లోనూ పవర్ గ్రిడ్, టిసిఎస్,సిప్లా, ఓఎన్‌జిసి,డాక్టర్ రెడ్డీస్  నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు