StockMarketOpening: దలాల్ స్ట్రీట్ దౌడు: ఎయిర్టెల్‌ హై జంప్‌, కారణాలివే!

31 Oct, 2022 10:20 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ  మార్కెట్లు సోమవారం  భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.  ప్రధాన సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేటు కోత అంచనాలు,  ఆర్‌బీఐ సమావేశం, చమురు ధరలు క్షీణత మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. సెన్సెక్స్‌  591.12 పాయింట్లు  లేదా 0.99 శాతం పుంజుకుని 60551  వద్ద , నిఫ్టీ 164.25 పాయింట్లు లేదా 0.92 శాతం పెరిగి 17,956 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే న్నాయి.  ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతి  ఎయిర్టెల్‌ 52 వారాల గరిష్టాన్ని తాకింది. 

ఇంకా ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్ర, ఐషర్‌ మోటార్స్‌, మారుతి సుజుకి, సన్‌ ఫార్మ లాభాల్లో ఉండగా, అపొలో హాస్పిటల్స్‌, టాటా స్టీల్‌, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ మాత్రమే   నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయ 16 పైసలు ఎగిసి 82.34 వద్ద ఉంది.  

మరిన్ని వార్తలు