Today Stock Market Update లాభాలన్నీ పాయే: అదానీ, ఇన్సూరెన్స్‌ షేర్ల షాక్‌!

1 Feb, 2023 16:29 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి.  ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభ పడ్డాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా 1200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ చివరలో లాభాలను కోల్పోయింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభాలకు  పరిమితమై  59,708వద్ద,  నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17616 వద్ద స్థిరపడింది. 

యూనియన్ బడ్జెట్‌లో బీమా ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించడంతో బీమా కంపెనీల పతనమైనాయి అలాగే అదానీ గ్రూప్ షేర్ల భారీ నష్టాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది.  హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ ,మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5శాతం నుండి 11శాతం మధ్య పతనాన్ని నమోదు చేసింది. 

ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (యూనిట్‌ లింక్‌డ్‌ పాలసీలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని సీతారామన్ ప్రతిపాదించారు. దీని ప్రకారం పాలసీల మొత్తం ప్రీమియం సంవత్సరానికి 500,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ 26 శాతం, అదానీ పోర్ట్స్ 17శాతం కుప్పకూలాయి. మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు