మార్కెట్‌ జోరుకు రెండో రోజు కూడా బ్రేకులు..!

20 Oct, 2021 16:38 IST|Sakshi

వరుస రికార్డులను నమోదుచేసిన దేశీ సూచీలకు మంగళవారం రోజున బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. బుధవారం రోజు కూడా అదే బాటలో దేశీ సూచీలు నడిచాయి. లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ ఉదయం 61,800.07 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించగా ఒకనొక సమయంలో 61,109.29 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది.
చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి  456.09 పాయింట్ల నష్టంతో 61,259.96 వద్ద సెన్సెక్స్‌ ముగిసింది. మరో వైపు  నిఫ్టీ కూడా నష్టాలను నమోదుచేసింది. 152.15 పాయింట్లను నష్టపోయి 18,266.60 వద్ద నిఫ్టీ స్థిరపడింది. 

నష్టాలను చవిచూసిన షేర్లలో టైటన్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ కంపెనీలు ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌  4 శాతం మేర లాభపడింది. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాలను గడించాయి.
చదవండి:  సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..!

మరిన్ని వార్తలు