రిలయన్స్‌, ఐటీసీ దెబ్బ : బుల్‌ రన్‌కు బ్రేక్‌

6 Jan, 2021 16:23 IST|Sakshi

2021లో స్టాక్‌మార్కెట్లో తొలిసారిగా నష్టాలు

డే హైనుంచి  700 పాయింట్లుపతనం

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో   బుల్‌ రన్‌కు  బ్రేక్‌ పడింది. గత పదిరోజులుగా లాభాలతో మురిపిస్తున్న సూచీలు కొత్త ఏడాదిలో తొలిసారిగా నేడు(బుధవారం) విరామం తీసుకున్నాయి.  ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్నాయి. 48600 స్థాయి వద్ద కొత్త రికార్డ్ గరిష్టాలను నమోదు చేసి తరువాత  మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.   ప్రధానంగా ఐటీ, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌ కౌంటర్లు  భారీగా నష్టపోయాయి. అలాగే  రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బజాజ్‌ ఫైనాన్స్‌  హెవీ వెయిట్‌  షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. డే హై నుంచి ఒకదశలో 700  పాయింట్లు కోల్పోయిన  సెన్సెక్స్‌  చివరకు 264 పాయింట్ల నష్టంతో 48174 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 14146 వద్ద ముగిసాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ నష్టపోగా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ , శ్రీ సిమెంట్స్‌,  గెయిల్‌ , హిందాల్కో గ్రాసీం  నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.

మరిన్ని వార్తలు