ప్రాఫిట్‌ బుకింగ్‌: 52 వేల దిగువకు  సెన్సెక్స్‌ 

9 Jun, 2021 15:35 IST|Sakshi

లాభాల స్వీకరణ 

రికార్డు  స్థాయిలనుంచి  వెనక్కి,

52 వేల దిగువకు సెన్సె‍క్స్‌

15700 దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసి రికార్డు స్థాయికి ఎగిసిన నిఫ్టీ చివరికి కీలక మద్దతు స్థాయికి దిగువన ముగిసింది.  భారీ అమ్మకాలతో  అటు సెన్సెక్స్‌ 52 వేల దిగువన ముగియడం గమనార్హం. సెన్సెక్స్‌ 334 పాయింట్ల నష్టంతో 51941 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు కోల్పోయి15635 వద్ద  క్లోజ్‌ అయింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ధోరణి కనిపించింది.  ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా ఇండస్‌ ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ,  కోటక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ,  యాక్సిస్‌, యూనియన్‌ బ్యాంకు,పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంకు తదితరలు నష్టపోయాయి. ఇంకా టాటా మోటార్స్‌,  శ్రీ సిమెంట్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి,  ఎల్‌ అండ్‌ టీ గ్రాసిం,  ఐషర్ మోటార్స్ , రిలయన్స్‌ నష్టపోగా ఓఎన్‌జిసి, ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, పవర్ గ్రిడ్, ఎస్‌బిఐ లైఫ్, భారత్ పెట్రోలియం, దివిస్ ల్యాబ్స్ లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు