స్టాక్ మార్కెట్: వరుస లాభాలకు బ్రేక్‌

4 Mar, 2021 18:02 IST|Sakshi

సాక్షి, ముంబై: వరుస లాభాలతో జోరుమీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం 50,711 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా కూడా నష్టాల్లోనే కొనసాగింది. బిఎస్‌ఇ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఇ)ల బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు నేడు 1 శాతానికి పైగా పడిపోయాయి. ట్రేడింగ్‌ ఇంట్రాడేలో సెన్సెక్స్ 51,245 వద్ద గరిష్ఠాన్ని.. 50,550 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 600 పాయింట్లు నష్ట్టపోయి 50,846.08 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 164.80 పాయింట్ల నష్టంతో 15,080 వద్ద స్థిరపడింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 72.83గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), ఐసిఐసిఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, శ్రీ సిమెంట్స్‌, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభపడ్డాయి.

చదవండి:

2 నెలల్లో పసిడి ధర ఎంత తగ్గిందంటే..

అలా అయితే రూ.75కే‌ లీటర్ పెట్రోల్‌!

మరిన్ని వార్తలు