కరోనా విజృంభణ: మార్కెట్‌ ఢమాల్‌ 

22 Feb, 2021 12:28 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా ఐదవ రోజు బలహీనంగా ఉన్న మార్కెట్లకు కరోనా సెగ తగిలింది.  దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోందన్నఅంచనాల మధ్య కీలక సూచీలు  కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 780, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కుప్ప కూలింది. దాదాపు అన్ని రంగాల షేర్లులో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఐటీ షేర్లలో ఒత్తిడి కనిపిస్తోంది.  (అమ్మకాల సెగ : నష్టాల్లో సెన్సెక్స్‌ )

మరోవైపు  కరోనా కేసులు పెరుగుతూ పోతుండటంతో మహారాష్ట్ర కఠిన చర్యలకు దిగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట లాక్‌డౌన్‌ విధించారు. కరోనా పట్ల నిర్లక్క్ష్యం పెరుగుతోందని, ముఖ్యంగా ముంబై నగరంలో ఫేస్‌మాస్క్‌ నిబంధనను పాటించని సుమారు 16వేలకు పైగా జనంపై జరిమానా వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రామాణికాలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చహల్‌ ముంబై నగర వాసులను  హెచ్చరించారు. ముఖ్యంగా వివాహాలు లాంటి వేడుకల్లో వేలాదిమంది కనీస నిబంధనలు పాటించకుండా తిరగడం బాధిస్తోందన్నారు. కరోనా ఇంకా నశించ లేదు.... ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న రెండు వారాలు చాలా కీలకమన్నారు. (లానే ఉంటే మరో 15 రోజుల్లో లాక్‌డౌన్‌: సీఎం)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు