-

బుల్‌ జోరు : మద్దతు స్థాయిల వద్ద  దెబ్బ

10 Mar, 2021 10:44 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఎఫ్‌ఐఐల కొనుగోళ్లకు తోడు గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో, దేశీయ ‌స్టాక్ మార్కెట్‌లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి.ఆరంభంలోనే 355  లాభంతో బలంగా మొదలైన  సూచీలు మద్దతు స్థాయిలవద్ద  స్థిరంగా కొనసాగుతున్నాయి.  టెలికాం, ఆయిల్‌ రంగ  షేర్లుమినహా అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు లాభ‌ప‌డి 51,252 వ‌ద్ద,  నిఫ్టీ  60 పాయింట్ల లాభంతో 15,156 వ‌ద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, సిప్లా సిప్లా బిఎస్‌ఇలో అత్యధిక లాభాలను ఆర్జించాయి.  ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా  తదితర  ఐటీ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు ఒఎన్‌జీసీ, యూపీఎల్‌,  భారతి ఎయిర్‌టెల్‌ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు