మెటల్‌ షైన్ ‌: సెన్సెక్స్‌ 800 పాయింట్లు జంప్‌

30 Mar, 2021 11:15 IST|Sakshi

49800 పాయింట్ల ఎగువకు  సెన్సెక్స్‌

14700 అధిగమించిన నిఫ్టీ

సాక్షి, ముంబై:  లాంగ్‌ వీకెండ్‌ తరువాత స్టాక్‌మార్కెట్లు  ఉత్సాహంగా మొదలయ్యాయి.  మూడురోజుల విరామం తరువాత, గ్లోబల్ మార్కెట్ల సానుకూల  సంకేతాలతో మంగళవారం కీలక సూచీలు లాభాల దౌడు తీస్తున్నాయి.  ట్రేడర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ఆరంభ లాభాలనుంచి మరింత దూసుకపోతున్న సెన్సెక్స్‌ 858 పాయింట్ల లాభంతో 49866 వద్ద, నిఫ్టీ 262 పాయింట్లు ఎగిసి 14769వద్ద  కొనసాగుతున్నాయి.  అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది.  ప్రధానంగా మెటల్‌, బ్యాంకింగ్‌, ఫార్మా రంగ షేర్లు లాభపడుతున్నాయి.  జేఎస్‌డబ్ల్యూ స్టీల్ , టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, గెయిల్, టైటన్ కంపెనీ,దివీస్ ల్యాబ్స్ లాభాల్లో, ఎం అండ్ ఎం, హీరోమోటోకార్ప్  స్వల్పంగా నష్టపోతున్నాయి. 
 

>
మరిన్ని వార్తలు