నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

13 Sep, 2021 16:25 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత కొద్ది సేపు లాభాలలో కొనసాగాయి. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో వచ్చిన లాభాలు కాస్త ఆవిరయ్యాయి. చివరకు సెన్సెక్స్ 127 పాయింట్లు (0.22 శాతం) క్షీణించి 58,177.76 వద్ద ఉండగా, నిఫ్టీ 14 పాయింట్లు (0.08 శాతం) నష్టపోయి 17,355.30 వద్ద ముగిసింది. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.75 వద్ద ఉంది.

సెప్టెంబర్ 13న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా నష్టపొగా.. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతి సుజుకి టాప్ సెన్సెక్స్ గెయినర్లుగా అవతరించాయి.(చదవండి: మళ్లీ గాల్లో ఎగరనున్న ఆ బడా ఎయిర్ లైన్స్ కంపెనీ)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు