లాభాల కళ, సెన్సెక్స్‌ 590 పాయింట్లు జంప్‌

23 Jun, 2022 10:30 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి.  బుధవారం నాటి భారీసెల్లింగ్‌నుంచి కీలక సూచీలు తెప్పరిల్లాయి. సెన్సెక్స్‌ 586 పాయింట్లు ఎగిసి 52408 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 15592 వద్ద కొనసాగుతున్నాయి. ఫైనాన్షియల్‌, ఆటో, మెటల్‌ రంగ షేర్లు దూకుడు మీద ఉన్నాయి. 

దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.  హీరో మోటో, టాటామోటార్స్‌, మారుతి  సుజుకి, ఏసియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు భారీ లాభాల్లో  ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్‌, పవర్‌ గ్రిడ్‌, టైటన్‌, బ్రిటానియా నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి  స్వల్ప లాభాలతో 78.25 వద్ద  ఉంది. బుధవారం 78.40 వద్ద  ఆల్‌ టైం కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు