ఆకాశమే హద్దుగా.. సరికొత్త రికార్డుల దిశగా

2 Feb, 2021 10:12 IST|Sakshi

ఆకాశమే హద్దు : 50 వేల మార్క్‌ను అధిగమించిన సెన్సెక్స్‌

సాక్షి, ముంబై:  బడ్జెట్‌ అనంతరం వరుసగా రెండో రోజు కూడా  దలాల్ స్ట్రీట్‌లో  లాభాల హవా  కొనసాగుతోంది.  ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూచీలు రికార్డు దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 50వేల  మార్క్‌ని  అధిగమించింది.  ప్రస్తుతం 1529 పాయింట్ల లాభంతో 50,128 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు ఎగిసి 14721 వద్ద, 14550 స్థాయిని దాటేసింది.  బ్యాంకింగ్‌ షేర్ల లాభాలతో అటు బ్యాంక్ నిఫ్టీ 4 శాతానికి పైగా పెరిగింది.(దలాల్‌ స్ట్రీట్‌లో మెరుపులు : ఎందుకంటే?)

టాటామోటార్స్, 9 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి 6 306.90 ను తాకింది.టెక్ మహీంద్రా, ఐసీఐసీఐఐ బ్యాంక్, యూపీఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో కూడా 3-8 శాతం లాభాలతోట్రేడ్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు