సెన్సెక్స్‌ 700 పాయింట్లు జంప్‌, ఎందుకంటే?

27 Jun, 2022 09:53 IST|Sakshi

53 వేల ఎగువకు సెన్సెక్స్‌

16 వేలకు చేరువలో నిఫ్టీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సానుకూల సకేంతాల దేశీయ సూచీలు ఈ వారం ఆదిలోనే శుభారంభం చేశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 700పాయింట్లు  జంప్‌ చేయగా, నిఫ్టీ 200 పాయింట్లు లాభంతో ట్రేడ్‌ అవుతోంది.  ఫలితంగా సెన్సెక్స్‌ 53430 వద్ద,నిఫ్టీ 15909 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వరుసగా మూడవ సెషన్‌లో లాభాలను కొనసాగుతుండటం విశేషం.  గత వారం చివరిలో వాల్ స్ట్రీట్ బలంగా పుంజుకోవడంతో  ఆసియా  మార్కెట్లు పాజిటివ్‌గా  ఉన్నాయి. 

ఐటీ, మెటల్‌ సహా అన్ని రంగాల షేర్లు  కొనుగోళ్లతో  జోరుగా ఉన్నాయి. టెక్‌ మహీంద్ర,  హెచ్‌సీఎల్‌, జేఎస్‌డబ్ల్యు, ఇన్ఫోసిస్‌, విప్రో సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.  అపోలో హాస్పిటల్‌ మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. 

మరిన్ని వార్తలు