-

Today Stockmarket update: బ్యాంక్స్‌ బేజారు, సెన్సెక్స్‌ భారీ పతనం

22 Aug, 2022 12:06 IST|Sakshi

60 వేల దిగువకు సెన్సెక్స్‌ 

సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా టట్రేడింగ్‌ను ఆరంభహించాయి.అనంతరం మరింత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.   సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమై 59021 వద్ద,నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 17569వద్ద కొనసాగుతున్నాయి. 

బ్యాంక్ నిఫ్టీ  దాదాపు 2 శాతం కుప్పకూలింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.5శాతం, యాక్సిస్ బ్యాంక్ ,టెక్ మహీంద్రా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దివీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అపోలో హాస్పిటల్స్‌ కూడా నష్టాల్లోకొనసాగుతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ టాప్ గెయినర్, హిందుస్తాన్ యూనిలీవర్ . డాక్టర్ రెడ్డీస్‌ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. 11 పైసలుకోల్పోయి 79.86వద్ద  ట్రేడ్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు