ట్రిపుల్‌ సెంచరీ- 38,000 దాటేసింది

5 Aug, 2020 09:36 IST|Sakshi

సెన్సెక్స్‌ 330 పాయింట్లు అప్‌

95 పాయింట్లు ఎగసి 11,190కు చేరిన నిఫ్టీ

మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్, ఆటో జోరు

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. తద్వారా మళ్లీ 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 332 పాయింట్లు ఎగసి 38,020 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 95 పాయింట్లు పురోగమించి 11,190కు చేరింది.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్, ఆటో 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్‌, యాక్సిస్, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌, ఇన్‌ప్రాటెల్‌, ఆర్‌ఐఎల్‌, గ్రాసిమ్‌, సిప్లా, బజాజ్‌ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ 3-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1 శాతం నష్టంతో కదులుతోంది. 

భారత్‌ ఫోర్జ్‌ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో భారత్‌ ఫోర్జ్‌, టాటా కన్జూమర్‌, ఆర్‌బీఎల్‌, నౌకరీ, సెయిల్‌, ఎన్‌ఎండీసీ, జిందాల్‌ స్టీల్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, ఐబీ హౌసింగ్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క గోద్రెజ్‌ సీపీ 1.5 శాతం, ఇండిగో 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1014 లాభపడగా.. 304 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు