ట్రిపుల్‌ సెంచరీతో షురూ- నిఫ్టీ సెంచరీ

23 Sep, 2020 09:38 IST|Sakshi

349 పాయింట్ల హైజంప్‌- 38,083కు సెన్సెక్స్‌

101 పాయింట్లు ఎగసి 11,255 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-1.4 శాతం అప్‌

అన్ని రంగాలూ లాభాల్లోనే- మెటల్‌ స్వల్ప వెనకడుగు

వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 349 పాయింట్లు జంప్‌చేసి 38,083కు చేరగా.. నిఫ్టీ 101 పాయింట్లు ఎగసి 11,255 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలకు డిమాండ్‌ నెలకొనడంతో నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ మంగళవారం యూఎస్‌ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే ఇటీవల పతన బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో ఇండెక్సులు ఊపందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. సెప్టెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ గురువారం ముగియనుండటం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు.

లాభాలతో
ఎన్‌ఎస్‌ఈలో అన్ని ప్రధాన రంగాలూ సగటున 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మెటల్‌ స్వల్పంగా 0.15 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, జీ, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా, డాక్టర్‌ రెడ్డీస్, ఐషర్‌, ఎల్‌అండ్‌టీ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, యాక్సిస్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ 2.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, శ్రీ సిమెంట్‌ 2-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో నౌకరీ, ఇండిగో, మైండ్‌ట్రీ, హావెల్స్‌, కోఫోర్జ్‌, గ్లెన్‌మార్క్‌, బీఈఎల్‌, అశోక్‌ లేలాండ్‌ 3.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా 3.4 శాతం పతనంకాగా.. పెట్రోనెట్‌, బీవోబీ, భారత్‌ ఫోర్జ్‌, అంబుజా, శ్రీరామ్‌ ట్రాన్స్‌, సెయిల్‌ 0.8-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-1.4 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,189 లాభపడగా.. 375 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

మరిన్ని వార్తలు