-

ట్రిపుల్‌- సెంచరీతో షురూ

25 Sep, 2020 09:39 IST|Sakshi

సెన్సెక్స్‌ 414 పాయింట్ల హైజంప్‌- 36,968కు

నిఫ్టీ 123 పాయింట్లు జూమ్‌- 10,928 వద్ద ట్రేడింగ్

‌ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1-2 శాతం మధ్య అప్‌

బీఎస్‌ఈలలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5 శాతం ప్లస్

ఆరు రోజుల వరుస నష్టాల నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో అటు సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీతోనూ, ఇటు నిఫ్టీ సెంచరీతోనూ ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో ఆపై మరింత ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 414 పాయింట్లు జంప్‌చేసి 36,968ను తాకగా.. నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 10,928 వద్ద ట్రేడవుతోంది.

ఆటో, ఫార్మా జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1-2 శాతం మధ్య బలపడ్డాయి. ఆటో, మెటల్‌, ఫార్మా, రియల్టీ, ఐటీ 2-1.5 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, ఐషర్‌, టీసీఎస్‌, హిందాల్కో, ఇండస్‌ఇండ్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా, ఎంఅండ్‌ఎం, ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతీ, ఐటీసీ, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌ 2.7-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అదికూడా 0.7-0.3 శాతం చొప్పున నీరసించాయి. 

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, అశోక్‌ లేలాండ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బీఈఎల్‌, పెట్రోనెట్‌, ఐడియా, నౌకరీ, టాటా కన్జూమర్‌, జీఎఆంర్‌, మదర్‌సన్‌ 3-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐసీఐసీఐ ప్రు, జీ, చోళమండలం, మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 2.7-0.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో  మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1255 లాభపడగా.. కేవలం 351 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు