StockMarketOpening: ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వ్యాఖ్యలు,నష్టాల్లో సూచీలు

16 Sep, 2022 09:45 IST|Sakshi

ప్రపంచ బ్యాంక్ , అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ హెచ్చరికలు

 ఇన్వెస్టర్లలో మాంద్యం భయాలు

సాక్షి, ముంబై: గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో  ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  ఆరంభంలో 500 పాయింట్లు కుప్పకూలింది. సెన్సెక్స్‌ 324 పాయింట్లు కోల్పోయి 59609 వద్ద,నిఫ్టీ 91 పాయింట్లు బలహీనపడి 27786 వద్ద కొనసాగుతోంది. ప్రపంచ బ్యాంక్ , అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికల తర్వాత ప్రపంచ మాంద్యం ఆందోళనల మధ్య పెట్టుబడి దారుల సెంటిమెంట్‌   బలహీనంగా ఉంది. 

దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆటో షేర్లు లాభపడుతున్నాయి. మారుతి  సుజుకి, ఐషర్‌ మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌,ఎఎన్టీపీసీ లాభాల్లో ఉండగా, టెక్‌ మహీంద్ర, విప్రో, ఎం అండ్‌ ఎం,  ఇన్ఫోసిస్‌ నష్టపోతున్నాయి.

గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్ డౌన్‌బీట్‌గా ఉందని, కొన్నిదేశాలు 2023లో మాంద్యంలోకి జారిపోతాయనే ఆందోళన ఇన్వెస్టర్లను భయపెడుతోంది.అయితే విస్తృతమైన ప్రపంచ మాంద్యం ఉంటుందా అనేది ఇపుడే అంచనా వేయలేదని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి వడ్డీ రేట్ల పెంపుతో 2023లో ప్రపంచం ప్రపంచ మాంద్యం వైపు దూసుకు పోవచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ముఖ్యంగా ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా, యూరో జోన్  ప్రభావితం కావవచ్చని తెలిపింది. 

మరిన్ని వార్తలు