దేశీయ మార్కెట్‌లో బుల్ జోరు

3 Mar, 2021 18:02 IST|Sakshi

దేశీయ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూల పవనాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు రాణించడంతో వరుసగా మూడో రోజైన బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల తో ముగిసాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు బుల్ జోరును కొనసాగించింది. 50,738 వద్ద ప్రారంభమైన ట్రేడింగ్‌ ఇంట్రాడేలో సెన్సెక్స్ 51,505 వద్ద గరిష్ఠాన్ని.. 50,532 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1,147 పాయింట్లు లాభపడి 51,444 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 327 పాయింట్ల లాభంతో 15,245 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.83గా ఉంది. నేటి మార్కెట్ లో బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. మారుతి సుజుకి ఇండియా, బజాజ్ ఆటో, మహీంద్రా & మహీంద్రా షేర్లు నష్టాల్ని చవిచూశాయి.

చదవండి:

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే!

మరిన్ని వార్తలు