ఆర్‌బీఐ దన్ను- సెన్సెక్స్‌ @38,000

6 Aug, 2020 16:05 IST|Sakshi

సెన్సెక్స్‌ 362 పాయింట్లు అప్‌

38,025 వద్ద ముగింపు

99 పాయింట్లు ఎగసిన నిఫ్టీ-11,200కు

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

పీఎస్‌యూ బ్యాంక్స్‌ మాత్రమే డీలా

వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 4 శాతంవద్దే కొనసాగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 362 పాయింట్లు జంప్‌చేసి 38,025 వద్ద నిలిచింది. తద్వారా తిరిగి 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ 99 పాయింట్లు ఎగసి 11,200 వద్ద స్థిరపడింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే ఓటు వేయడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,221- 37,755 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. నిఫ్టీ సైతం 11,257- 11,127 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

పలు రంగాలు ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగాలు 1.8-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.7 శాతం బలపడగా.. ప్రభుత్వ బ్యాంక్స్‌ 0.3 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, జీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, సిప్లా, టాటా మోటార్స్‌, ఐటీసీ 3.8-1,3 శాతం మధ్య పెరిగాయి. అయితే ఐషర్, శ్రీ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ 1.3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

టొరంట్‌ ఫార్మా అప్‌
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో టొరంట్‌ ఫార్మా, ఈక్విటాస్‌, పీఎఫ్‌సీ, గ్లెన్‌మార్క్‌, దివీస్‌, టీవీఎస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, సెయిల్‌  4.6-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. బాటా, ముత్తూట్‌, బంధన్‌ బ్యాంక్‌, భెల్‌, ఇండిగొ, ఎస్కార్ట్స్‌, మణప్పురం, కేడిలా, పీవీఆర్‌, బీఈఎల్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 4-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1579 లాభపడగా.. 1079 నష్టపోయాయి.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 60 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 426 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 666 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు