RBI policy: ఫ్లాట్‌గా మార్కెట్లు

4 Jun, 2021 09:50 IST|Sakshi

ఫ్లాట్‌ ప్రారంభం

వెంటనే లాభాల్లోకి, నిఫ్టీ సరికొత్త గరిష్టం

ఆర్‌బీఐ పాలసీ రివ్యూపై  కన్ను

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో కాస్త తడబడిన సూచీలు వెంటనే లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 101 పాయింట్లు ఎగిసి 52334 వద్ద, నిప్టీ 29 పాయింట్ల లాభంతో 15720 వద్ద సరికొత్త గరిష్టానికి చేరాయి.  ఆర్‌బీఐ మరికొద్ద సేపట్లో  తన పాలసీ విధానాన్ని ప్రకటించనుంది. దాదాపు కీలక వడ్డీరేట్లను యథాయథంగానే ఉంచనుందన్న అంచనాల మధ్య  దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

ఓఎన్‌జిసి, ఎల్ అండ్‌ టీ,  టెక్ మహీంద్రా, ఎం అండ్‌ ఎం,  పవర్ గ్రిడ్  భారతి ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలలో ఉన్నాయి. నెస్లే ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్), ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఆర్‌ఐఎల్ స్టాక్స్ నష్టపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్  ఈ ఉదయం 10 గంటలకు ద్రవ్య విధాన ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు స్థాయిలో 226 లక్షల కోట్లకు చేరుకుంది.  ఇటీవలి రికార్డు స్థాయి మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో గురువారం నాటికి మొత్తం  కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .2,26,51,439.68 కోట్లుగా ఉంది. గురువారం ఒక్కరోజే 1,88,767.14 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించడం విశేషం.

చదవండి:  దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు!
Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్‌!

మరిన్ని వార్తలు