పాలసీ రివ్యూపై దృష్టి : లాభాల్లో సూచీలు

6 Aug, 2020 09:44 IST|Sakshi

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ రివ్యూ  

అప్రమత్తంగా ట్రేడర్లు

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా  లాభాలతో  మొదలయ్యాయి. ఆరంభంలోనే 300 పాయింట్లు జంప్ చేసిన సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 37825 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 11151 వద్ద కొనసాగుతోంది. రిజర్వు బ్యాంకు  మరికొన్ని గంటల్లో ప్రకటించనున్న ద్వైమాసిక  పాలసీ రివ్యూ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. దాదాపు  అన్ని రంగాల షేర్లలోనూ లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 38వేల దిగువన, నిఫ్టీ 11150కి దిగువన  ట్రేడ్ అవుతున్నాయి.  ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా తీవ్ర  ఊగిసలాట కనిపిస్తోంది.

ఓఎన్జీజీసీ, టెక్ మహీంద్ర భారీగా లాభపడుతుండగా మారుతి సుజుకి, ఎయిర్ టెల్ భారీగా నష్టపోతున్నాయి. ఇంకా హిందాల్కో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, అదానీ, టాటా మోర్స్ లాభపడుతున్నాయి.  అటు హెచ్డీఎఫ్ సీ లైఫ్,  యూపీఎల్, విప్రో, పవర్ గ్రిడ్ నష్టపోతున్నాయి.  ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)  నేడు (ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు) మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

మరిన్ని వార్తలు