WhatsApp: దాదాపు 27 లక్షల ఖాతాలపై నిషేధం

3 Nov, 2022 14:58 IST|Sakshi

సాక్షి,ముంబై: మెటాకు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్  30  వరకు  ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది.సెప్టెంబర్ నివేదిలో సంబంధిత వివరాలను సంస్థ వెల్లడించింది. ఇందులో 8 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్లనుఎలాంటి ఫిర్యాదలు  రాకముందే  తొలగించినట్లు వాట్సాప్ పేర్కొంది.

ఫేక్‌ వార్తలు,  తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్‌ చేసింది. అలాగే  భారత ఐటీ రూల్స్ 2021కి (IT Rules 2021) అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిలిపి వేస్తుంది.  ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు   2022 సెప్టెంబర్  యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు  అందించింది. అలాగే సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా,  23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది.

గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు ప్రతిస్పందించడం, వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన  కంటెంట్‌ను నివారిస్తున్నామని, ఎందుకంటే హాని జరిగిన తరువాత గుర్తించడం కంటే ముందునేగా  నివారించడానికే తమ ప్రాధాన్యత   వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ  నేపథ్యంలో వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు  వెల్లడించింది.

మరిన్ని వార్తలు