స్టార్టప్‌ల కోసం సీక్వోయా నిధులు

15 Jun, 2022 02:33 IST|Sakshi

రూ. 22,000 కోట్ల సమీకరణ  

న్యూఢిల్లీ: స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుగా సీక్వోయా ఇండియా, సీక్వోయా ఆగ్నేయాసియా 2.85 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 22,000 కోట్లు)ను సమీకరించాయి. వెరసి గత ఫండ్‌తో పోలిస్తే రెట్టింపు నిధులను సిద్ధం చేసింది. సీక్వోయా తొలిసారి 85 కోట్ల డాలర్లతో దక్షిణాసియాకు ప్రత్యేకించిన ఫండ్‌ను ఆవిష్కరిస్తోంది. మరో 2 బిలియన్‌ డాలర్లను ఇండియన్‌ వెంచర్, గ్రోత్‌ ఫండ్స్‌కు కేటాయించింది.

గత 16 ఏళ్లలో ఇండియా, ఆగ్నేయాసియాలకు 9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడినట్లు ఎస్‌ఈసీ ఫైలింగ్స్‌లో సీక్వోయా వెల్లడించింది. సీక్వోయా ఇండియా దేశీయంగా వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడుల్లో దూకుడు చూపుతోంది. ప్రధానంగా ఇండియా, దక్షిణాసియాలలో 400కుపైగా స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేసింది. వీటిలో 36 వరకూ యూనికార్న్‌లున్నాయి. ఈ జాబితాలో బైజూస్, జొమాటో, అన్‌అకాడమీ, పైన్‌ల్యాబ్స్, రేజర్‌పే తదితరాలు చేరాయి. గత 18 నెలల్లో సీక్వోయా నిధులు అందుకున్న స్టార్టప్‌లలో 9 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను సైతం చేపట్టడం గమనార్హం! 

మరిన్ని వార్తలు