గ్రీన్‌కోతో సెరెంటికా జట్టు..

15 Nov, 2022 04:46 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పారిశ్రామిక క్లయింట్లకు నిరాటంకంగా పునరుత్పాదక విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా గ్రీన్‌కో గ్రూప్‌తో సెరెంటికా రెన్యువబుల్స్‌ చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్‌కో గ్రూప్‌కి సంబంధించి 1500 మెగావాట్‌ అవర్‌ పునరుత్పాదక విద్యుత్‌ నిల్వ సామర్థ్యాన్ని వినియోగించుకోనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని పిన్నాపురంలో, మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్‌లో అందుబాటులోకి వస్తున్న ఆఫ్‌ స్ట్రీమ్‌ క్లోజ్డ్‌ లూప్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌ (ఓసీపీఎస్‌పీ) ఉపయోగపడ నున్నాయి.

వివిధ క్లయింట్లకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఈ ఒప్పందం సహా యపడగలదని సెరెంటికా రెన్యువబుల్స్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ అగర్వాల్‌ తెలిపారు. ట్విన్‌స్టార్‌ ఓవర్‌సీస్‌కు 100% అనుబంధ సంస్థగా సెరెంటికా 2022లో ఏర్పాటైంది. ట్విన్‌స్టార్‌కి స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌లో నియంత్రణ స్థాయి వాటాలు ఉన్నాయి. గ్రీన్‌కో గ్రూప్‌నకు సౌర, పవన, హైడ్రో జనరేషన్‌ టెక్నాజీలవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సుమారు 7.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది.

మరిన్ని వార్తలు