యూనికార్న్‌ హోదాకు సర్విఫై! 

25 Aug, 2022 09:04 IST|Sakshi

తాజాగా రూ. 520 కోట్ల సమీకరణ 

ముంబై: వివిధ స్మార్ట్‌ఫోన్‌ వెండార్‌ ప్రొడక్టుల(డివైస్‌లు) లైఫ్‌సైకిల్‌ను నిర్వహించే సర్విఫై తాజాగా 6.5 కోట్ల డాలర్లు(రూ. 520 కోట్లు) సమీకరించింది. సింగులారిటీ గ్రోత్‌ అపార్చునిటీ ఫండ్‌ అధ్యక్షతన పలు సంస్థలు నిధులు అందించినట్లు సర్విఫై వెల్లడించింది.

తాజా పెట్టుబడులతో కంపెనీ విలువ దాదాపు బిలియన్‌ డాలర్లకు చేరినట్లు సర్విఫై వ్యవస్థాపకుడు శ్రీవాస్తవ ప్రభాకర్‌ పేర్కొన్నారు. శామ్‌సంగ్, ఆపిల్‌ తదితర గ్లోబల్‌ బ్రాండ్లకు సర్వీసులందించే సంస్థ రానున్న 18-24 నెలల్లో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే లక్ష్యంతో ఉన్నట్లు శ్రీవాస్తవ తెలియజేశారు. ఐరన్‌ పిల్లర్, బీనెక్ట్స్, బ్లూమ్‌ వెంచర్స్, డీఎంఐ స్పార్కిల్‌ ఫండ్‌ తదితరాలు పెట్టుబడులు సమకూర్చినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మరోసారి 7 కోట్ల డాలర్లవరకూ నిధులను సమీకరించే వీలున్నట్లు తెలియజేశారు. 
 

మరిన్ని వార్తలు