ఎలన్‌మస్క్‌ ఎందుకిలా జరుగుతోంది? టెస్లా కార్లలో సాంకేతిక సమస్యలు

20 Nov, 2021 15:06 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌లో ప్రపంచ రారాజుగా ఉన్న టెస్లాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సాంకేతిక సమస్యల కారణంగా టెస్లా కారు ఓనర్లు చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ కారు యజమానులు టెస్లా యజమాని ఎలన్‌మస్క్‌ని డిమాండ్‌ చేస్తున్నారు.

పని చేయని యాప్‌
టెస్లా కంపెనీ నుంచి మార్కెట్‌లో మోడల్‌ 3 వై, మోడల్‌ ఎస్‌, ఎస్‌ ప్లెయిడ్‌ కార్లు మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడయ్యాయి. యూరప్‌, అమెరికా మార్కెట్‌లో టెస్లా కార్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే ప్రయత్నంలో భాగంగా టెస్లా కార్లకు మొబైల్‌యాప్‌ రూపంలో డిజిటల్‌ కీస్‌ని అమర్చారు. అంటే టెస్లా యాప్‌ ద్వారా కారును డోర్స్‌ ఓపెన్‌ చేయడం, కారును స్టార్‌ చేయడం తదితర కంట్రోల్స్‌ అన్నీ ఈ మొబైల్‌ యాప్‌ ద్వారానే కంట్రోల్‌ చేయోచ్చు.

ఇబ్బందులు
గత కొంత కాలంగా ఈ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. తరచుగా యాప్‌ మోరాయిస్తోంది. దీంతో యూజర్లు టెస్లా కారును వినియోగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కారు పక్కనే ఉండి గంటల తరబడి డోర్‌ ఓపెన్‌ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

ట్రాఫిక్‌ వల్లే
మొదట ఈ సమస్య కెనడాలో ఎక్కువగా కనిపించగా ఆ తర్వాత అమెరికాలోనూ ఈ సమస్య వెలుగు చూసింది. ఇటీవల మొబైల్‌యాప్‌కి అప్‌డేట్‌ని టెస్లా రిలీజ్‌ చేసింది. అప్పటి నుంచి ఈ సమస్య ఉత్పన్నమైనట్టు యూజర్లు అంటున్నారు. మరోవైపు నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ సమస్య వచ్చిందని త్వరలో పరిష్కరిస్తామని టెస్లా తరఫున ఎలన్‌మస్క్‌ బదులిచ్చారు.

చదవండి:ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!

మరిన్ని వార్తలు