నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌!

11 Aug, 2020 08:31 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 73 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,326-11,381 వద్ద రెసిస్టెన్స్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అప్‌

యూఎస్‌ మార్కెట్ల మిశ్రమ ముగింపు

నేడు (11న) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 11,366 వద్ద ట్రేడవుతోంది.  సొమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,293 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్‌ దిగ్గజాలు డీలా పడటంతో సోమవారం నాస్‌డాక్‌ 0.7 నష్టపోగా.. డోజోన్స్‌ 1.3 శాతం ఎగసింది. అయితే ప్రస్తుతం ఆసియాలో అత్యధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. దీంతో నేడు మార్కెట్లు హుషారుగా కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఫార్మా ధూమ్‌ధామ్‌
విదేశీ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 144 పాయింట్లు పెరిగి 38,182 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం56 పాయింట్లు బలపడి 11,270 వద్ద ముగిసింది. ప్రధానంగా ఫార్మా కౌంటర్లు, డిఫెన్స్‌ రంగ షేర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,337-11,238 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  11,226 పాయింట్ల వద్ద, తదుపరి 11,183 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,326 పాయింట్ల వద్ద, ఆపై 11,381 వద్ద  నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,773 పాయింట్ల వద్ద, తదుపరి 21,646 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,050 పాయింట్ల వద్ద, తదుపరి 22,199 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 303 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 397 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 439 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

>
మరిన్ని వార్తలు