నేడు సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?! 

6 Oct, 2020 08:40 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు అప్‌

నిఫ్టీకి 11,570-11,637 వద్ద రెసిస్టెన్స్‌!

సోమవారం యూఎస్‌ మార్కెట్లు 2 శాతం ప్లస్‌

ప్రస్తుతం లాభాలలో ఆసియా మార్కెట్లు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు

నేడు(6న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 11,572 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,527 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సోమవారం యూఎస్‌ మార్కెట్లు 2 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు 0.5-1 శాతం మధ్య లాభాలతో ట్రేడవుతున్నాయి. వరుసగా రెండు రోజులపాటు ర్యాలీ చేసిన నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

రెండో రోజూ జోరు
గత వారం చివర్లో హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సోమవారం మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 277 పాయింట్లు లాభపడి 38,974 వద్ద ముగిసింది. నిఫ్టీ 86 పాయింట్లు పుంజుకుని 11,503 వద్ద నిలిచింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 39,264 వరకూ ఎగసింది. నిఫ్టీ సైతం 11,578 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.  

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,444 పాయింట్ల వద్ద, తదుపరి 11,386 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,570 పాయింట్ల వద్ద, ఆపై 11,637 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,156 పాయింట్ల వద్ద, తదుపరి 21,941 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,677 పాయింట్ల వద్ద, తదుపరి 22,984 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 237 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 472 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. కాగా.. గత గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,632 కోట్లు, డీఐఐలు రూ. 259 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా