ఫోర్బ్స్‌ టూల్స్‌ బిజినెస్‌ విడదీత

27 Sep, 2022 06:21 IST|Sakshi

షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రెసిషన్‌ టూల్స్‌ బిజినెస్‌ను విడదీయనున్నట్లు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ కంపెనీ ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ(ఎఫ్‌సీఎల్‌) తాజాగా వెల్లడించింది. ఫోర్బ్స్‌ ప్రెసిషన్‌ టూల్స్‌ అండ్‌ మెషీన్‌ పార్ట్స్‌ లిమిటెడ్‌(ఎఫ్‌పీటీఎల్‌) పేరుతో కొత్త కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సోమవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఎఫ్‌సీఎల్‌ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకి మరో ఎఫ్‌పీటీఎల్‌ షేరుని జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

వీటిని బీఎస్‌ఈలో లిస్ట్‌ చేయనున్నట్లు తెలియజేసింది. గతేడాది(2021–22) ఈ విభాగం రూ. 179 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు తెలియజేసింది. సంబంధిత విభాగంపై మరింత దృష్టి సారించడంతోపాటు వాటాదారులకు విలువ చేకూర్చే బాటలో తాజా ప్రణాళికకు తెరతీసినట్లు వివరించింది. కాగా.. ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, కోడింగ్‌ మెడికల్‌ పరికరాలు, విడిభాగాలు, అప్లికేషన్లు, వెంటిలేటర్లు, రియల్టీ తదితర వివిధ బిజినెస్‌లను షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు