రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

3 Nov, 2021 16:09 IST|Sakshi

ముంబై: వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత ఊసురుమనిపించాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగడం, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడటంతో సూచీలు నష్టాల్లో కొనసాగాయి. చివరకు, సెన్సెక్స్ 257.14 పాయింట్లు (0.43%) క్షీణించి 59,771.92 వద్ద ముగిస్తే, నిఫ్టీ 59.80 పాయింట్లు (0.33%) క్షీణించి 17,829.20 వద్ద ముగిసింది. నేడు సుమారు 1509 షేర్లు అడ్వాన్స్ అయితే, 1662 షేర్లు క్షీణించాయి, 143 షేర్లు మారలేదు.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.47 వద్ద ఉంది. నేటి మార్కెట్లో ఎల్ అండ్ టి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యుపిఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ఎక్కువ లాభపడితే.. సన్ ఫార్మా, ఇండస్ సిండ్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో ఆటో, బ్యాంక్ ఒక్కొక్కటి 1 శాతం పడిపోగా.. రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరిగాయి. 

(చదవండి: నువ్వు 45 వేల కోట్లిస్తే, నేను 74 కోట్లిస్తా..!)

మరిన్ని వార్తలు