నష్టాలతో మొదలైన మార్కెట్‌

16 Aug, 2021 10:01 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో మొదలైంది. మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెట్టడంతో ఇటు సెన్సెక్స్‌, అటు  నిఫ్టీ సూచీలు వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. దేశీయంగా మార్కెట్‌పై ప్రభావం చూపే నిర్ణయాలు, సంఘటనలు చోటు చేసుకోకపోయినా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. గత వారం మొత్తం బుల్‌ జోరు కొనసాగగా.. ఈ వారం నష్టాలతో మార్కెట్‌ మొదలైంది.

ఈరోజు ఉదయం సెన్సెక్స్‌ 55,479 పాయింట్లతో మొదలైంది. మార్కెట్‌ ప్రారంభైమంది మొదలు ఒత్తిడి లోనైంది. వరుసగా పాయింట్లు కొల్పోతూ వస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో 54 పాయింట్లు నష్టపోయి 55,383 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం నష్టాల దిశగానే ప్రయాణం చేస్తోంది. 40 పాయింట్లు నష్టపోయి 16,499 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు లాభాలు పొందగా బజాజ్‌ ఆటో , పవర్‌ గ్రిడ్‌, మారుతి, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్‌ షేర్లు సెన్సెక్స్‌లో నష్టాలను చవి చూశాయి. 

మరిన్ని వార్తలు