జోరు తగ్గని స్టాక్‌ మార్కెట్‌... లాభాల్లో సూచీలు

16 Aug, 2021 16:11 IST|Sakshi

ముంబై : ఈ వారం లాభాలతో మార్కెట్‌ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల దిశగా ప్రయాణించిన మార్కెట్‌ ఆ తర్వాత పుంజుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు మార్కెట్‌పై నమ్మకం చూపించడంతో పాటు హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ తగ్గుముఖం పట్టిందంటూ వార్తలు వెలువడంతో మార్కెట్‌ లాభాల్లోకి వచ్చింది. ద్రవ్యోల్బణ ‍ ప్రమాదం లేదని తేలడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.

ఈ రోజు ఉదయం బీఎస్‌సీ సెన్సెక్స్‌ 55,479 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లను కోల్పోయింది. ఓ దశలో ఏకంగా 55,281 పాయింట్లకు పడిపోయింది. ఇక ఇన్వెస్టర్లకు నష్టాలు తప్పవనుకునే క్రమంలో మళ్లీ పుంజుకుంది. సాయంత్రం మార్కెట్‌ ముగిసే సమయానికి 145 పాయింట్లు లాభపడి 55,582 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 34 పాయింట్లు లాభపడి 16,563 పాయింట్ల వద్ద ముగిసింది. 

టాటాస్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. మారుతి సుజూకి, బజాజ్‌ ఆటో, పవర్‌ గ్రిడ్‌, అల్ర్టాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి

మరిన్ని వార్తలు