నాకు ఆ సినిమా గుర్తొస్తుంది..హర్ష్‌ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు!

25 Jan, 2023 14:19 IST|Sakshi

షార్క్ ట్యాంక్ ఇండియా..! ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్‌లను వెలుగులోకి తెచ్చేందుకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. అమెరికాలో విజయవంతమైన ‘షార్క్‌ ట్యాంక్‌ షో’ దీనికి స్ఫూర్తి. ఇలాంటి షోలు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వరకు ఉన్నాయి. అన్ని చోట్లా ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలకే అవకాశం ఇస్తున్నారు. 

ఇప్పటికే ఈ షో మొదటి సీజన్‌ 2021లో విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రెండో సీజన్‌ ప్రారంభమైంది. అయితే విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ కార్యక్రమంపై భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని షో జడ్జ్‌ అనుపమ్‌ మిట్టల్‌ ఖండించారు. 
  
హర్ష్‌ గోయెంకా ఏమన్నారంటే?
ఎప్పుడూ మోటివేషన్‌, లేదా రోజూ వారి సామాజిక మాద్యమాల్లో జరిగే ఘటనల గురించి మాట్లాడే హర్ష్‌ గోయెంకా.. ఈ సారి రూటు మార్చారు. షార్క్‌ ట్యాంక్‌ షో జడ్జెస్‌ గురించి, వాళ్లు చేసే బిజినెస్‌ గురించి స్పందించారు. దేశానికి చెందిన స్టార్టప్‌లు పెద్దమొత్తంలో నష్టపోతున్నాయంటూ.. వారి నష్టాన్ని 1975లో విడుదలైన అడ్వంచర్‌ అండ్‌ థ్రిల్లర్‌   హాలీవుడ్‌ మూవీ జాస్‌తో పోల్చారు. ఎప్పుడైనా సరే థింక్స్‌ ఆఫ్‌ షార్క్స్‌ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

తాను చేసిన వ్యాఖ్యలు నిజమనేలా కంపెనీల లాభ నష్టాల డేటా స్క్రీన్‌ షాట్‌లను షేర్‌ చేశారు. వాటిల్లో 2022 ఆర్ధిక సంవత్సరంలో బోట్‌ కంపెనీ అధినేత అమన్‌ గుప్త రూ.79 కోట్ల లాభం గడించారు. కార్‌ దేకో కోఫౌండర్‌ అమిత్‌ జైన్‌ రూ. 246 కోట్లు లాస్‌ అయ్యారు. లెన్స్‌ కార్ట్‌  102 కోట్లు, షాదీ. కామ్‌ రూ.27 కోట్లు, సుఘర్‌ కాస్మోటిక్స్‌ అధినేత వినీత్‌ సింగ్‌ రూ.75కోట్లు నష్టపోయారని ఆ స్క్రీన్‌ షాట్‌లను షేర్‌ చేయగా.. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా షోని నేను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను. ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్‌లను వెలుగులోకి తెస్తుంది’. కానీ నేను షార్క్‌ల గురించి ఆలోచించినప్పుడల్లా, 'జాస్' సినిమా, ఆ సినిమాలోని రక్త పాతం గుర్తుకు వస్తుందని అన్నారు. 

 పక్షపాతంగా, అర్ధరహితంగా
ఆ ట్వీట్‌పై షార్క్‌ ట్యాంక్‌ జడ్జ్‌ షాది.కామ్‌ ఫౌండర్‌, అనుపమ్‌ మిట్టల్‌ స్పందించారు. సార్‌ మీరు దానిని హాస్యాస్పదంగా చెప్పారని అనిపిస్తుంది. మీరు పక్షపాతంగా, అసంపూర్ణంగా ఉండే అంశాలపై ప్రతిస్పందించారని నేను భావిస్తున్నాను. కానీ మీలాగే..సొరచేపలు నష్టాల్ని కాకుండా లాభాల్ని తెచ్చిపెడుతున్నాయంటూ చమత్కరించారు.

మరిన్ని వార్తలు