2030 నాటికి 10,000 చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు: షెల్‌ ప్రణాళికలు

16 Sep, 2022 07:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ పాయింట్లు నెలకొల్పుతున్న ఐవోసీ, రిలయన్స్‌–బీపీ తదితర సంస్థల జాబితాలో తాజాగా షెల్‌ కూడా చేరుతోంది. 2030 నాటికి దేశీయంగా 10,000 పైచిలుకు చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. 

కార్లు, ద్విచక్ర వాహనాల కోసం తమ తొలి ఈవీ చార్జర్లను ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. తొలి విడతలో బెంగళూరులోని యశ్వంత్‌పూర్, బ్రూక్‌ఫీల్డ్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న తమ పెట్రోల్‌ బంకుల్లో రీచార్జ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు సంస్థ పేర్కొంది. 

మరిన్ని వార్తలు