Shema Electric: 150 కి.మీ. రేంజ్‌తో భారత్‌లో ఎలక్ట్రిక్‌​ బైక్స్‌ లాంచ్‌..! ధర ఎంతంటే..?

28 Dec, 2021 14:40 IST|Sakshi

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ ఊపందుకుంది. దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలతో పాటుగా స్టార్టప్స్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించాయి. తాజాగా ఒడిశాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ షెమా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఈవీ ఇండియా ఎక్స్‌పో 2021లో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. 

ఎస్‌ఈఎస్‌ టఫ్‌
హైస్పీడ్‌ విభాగంలో ఎస్‌ఈఎస్‌ టఫ్‌, లో స్పీడ్‌ విభాగంలో ఎస్‌ఈఎస్‌ హాబీని ఆవిష్కరించింది. ఎస్‌ఈఎస్‌  టఫ్ బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) సెగ్మెంట్ కోసం రూపొందించారు. ఎస్‌ఈఎస్‌ టఫ్‌ గరిష్టంగా 60 కెఎమ్‌పీహెచ్‌ వేగంతో 150 కిమీ మేర ప్రయాణించనుంది. ఎస్‌ఈఎస్‌ టఫ్ స్కూటర్‌ 150 కిలోల లోడ్ మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. డ్యూయల్ 60V, 30 Ah లిథియం డిటాచ్‌బుల్‌ బ్యాటరీతో రానుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది

ఎస్‌ఈఎస్‌ హాబీ
ఎస్‌ఈఎస్‌ హాబీ అనేది తక్కువ-స్పీడ్ కేటగిరీలో ఎలక్ట్రిక్ స్కూటర్. దీని గరిష్ట గరిష్ట  25 kmph, ఒక సారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. మేర ప్రయాణించనుంది. ఎస్‌ఈఎస్‌ హాబీలో కూడా 60 V, 30 Ah డిటాచబుల్‌ బ్యాటరీతో రానుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. SES తన మొత్తం ఉత్పత్తి శ్రేణిని EV ఎక్స్‌పో 2021లో తక్కువ-స్పీడ్ విభాగంలో ప్రదర్శించింది.

ఈవీ ఎక్స్‌పోలో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ...షేమా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు & సీవోవో యోగేష్ కుమార్ లాత్ మాట్లాడుతూ..."భారత్‌లో ఈవీ మార్కెట్‌ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈవీ విభాగంలో భారత లక్ష్యాలను చేరుకునేందుకు తమ కంపెనీ పనిచేస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో 2 నుంచి 3 కొత్త హై-స్పీడ్ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం షెమా  నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను  చేస్తోంది. రాబోయే ఆరు నెలల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, కేరళ, కర్ణాటక , గుజరాత్ వంటి కీలక మార్కెట్లలో తన నెట్‌వర్క్‌ను విస్తరించే యోచనలో ఉందని పేర్కొన్నారు. 

చదవండి: భారత్‌కు రానున్న అమెరికన్‌ దిగ్గజ కంపెనీ..!

మరిన్ని వార్తలు