Meta: ఉద్యోగాల ఊచకోత తరువాత ‘మెటా’ మరో షాకింగ్‌ డెసిషన్‌

12 Jan, 2023 17:13 IST|Sakshi

న్యూఢిల్లీ: వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా  ఫుల్‌ టైం ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వేల ఉద్యోగులను తొలగించిన  సంస్థ  చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసు కోవడం ఇదే తొలిసారని పలువురు వ్యాఖ్యానించారు.

నియామక అవసరాలను తిరిగి అంచనా వేయడం కొనసాగిస్తున్నాం. చాలా స్వల్ప సంఖ్యలో అభ్యర్థుల ఆఫర్‌లను ఉపసంహరించుకుంటూ కష్టమైన నిర్ణయం తీసుకున్నామన్న మెటా ప్రతినిధి  వ్యాఖ్యలను  టెక్ క్రంచ్‌  నివేదించింది. మెటా  ఇటీవల 20 మంది ఆఫర్‌లను రద్దు  చేసిందని ఇంజనీర్ ,రచయిత గెర్గెలీ ఒరోస్జ్  ట్వీట్  చేశారు. ప్రపంచ మాంద్యం భయాలు నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2022 నవంబరులో ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది ఉద్యోగులను ఫేస్‌బుక్‌ తొలగించడం టెక్‌ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతంలో తన లండన్ కార్యాలయంలో 2023 వేసవి ఇంటర్న్‌షిప్ ఆఫర్‌లను రద్దు చేసింది

మరిన్ని వార్తలు