ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్‌ దిగ్గజాలకు మస్క్‌ సంచలన సలహా

25 May, 2023 13:37 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న లేఆప్స్‌ విషయంలో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రకటన చేశారు. ట్విటర్‌లో వేలాది  ఉద్యోగులను తొలగించిన  సీఈఓ మస్క్ సిబ్బంది తొలగింపుల విషయంలో తన విధానాన్నేఅనుసరించాలంటూ సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలకు సలహా ఇచ్చారు. 

ఫలితంగా ఉత్పాదకత  మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగాల కోతతో ఫలితాలు బావున్నాయి. ఇదే నిజం. ఉత్పాదకతను ప్రభావితం చేయకుండా ఇతర కంపెనీలు కూడా ఇలాగే చేయాలి’   అంటూ సలహా ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

(విప్రో చైర్మన్‌ కీలక నిర్ణయం, సగం జీతం కట్‌)

లండన్‌లోని  సీఈవోల కౌన్సెల్ సమ్మిట్‌లో వాల్ స్ట్రీట్ జర్నల్‌తో వర్చువల్ ఇంటరాక్షన్‌లో మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను  కంపెనీని టేకోవర్ చేయడానికి ముందు చాలా మంది పెద్దగా విలువలేనివారుగా కనిపించారన్నారు.  అందుకే ఉద్యోగాల కోతలకు నిర్ణయించాననీ, ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్యే సహేతుకమైన సంఖ్య అని ప్రకటించారు.  అంతేకాదు  గత ఆరేళ్లలో  రానీ  ఫీచర్లు ట్విటర్‌ ఆరు నెలల్లో ట్విటర్‌లో పెరిగాయని  చెప్పుకొచ్చారు.

కాగా గత  ఏడాది (అక్టోబర్ 2022లో)  44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను టేకోవర్‌ చేసిన వెంటనే  అప్పటి  సీఈవో పరాగ్ అగర్వాల్‌ సహా, కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. ఆ తరువాత నెల వ్యవధిలోనే 60 శాతానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 7500గా ఉన్న ఉద్యోగుల సంఖ్య ల కేవలం 1,500 మంది ఉద్యోగులే మిగిలారు.  (వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు)

మరిన్ని వార్తలు