షార్ట్‌వీడియో యూజర్ల జోరు !

31 Jul, 2021 01:05 IST|Sakshi

రీల్స్, జోష్, మోజ్, రొపోసో వంటి షార్ట్‌వీడియో యాప్స్‌ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 4–4.5 కోట్ల నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారని.. 2025 నాటికి ఈ సంఖ్య 65 కోట్లకు చేరుతుందని రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ అంచనా వేసింది. కొత్తగా 30 కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు చేరడమే ఈ వృద్ధి అంచనాలకు ప్రధాన కారణమని తెలిపింది. ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి ఇంటర్నెట్‌ ఫ్లాట్‌ఫామ్‌ల తర్వాత ఏడాదిలో  వినియోగదారులు క్రియాశీలంగా గడిపిన రెండవ అతిపెద్ద విభాగం షార్ట్‌వీడియోలేనని పేర్కొంది. యూజర్ల సంఖ్యతో పాటు యాప్స్‌ వినియోగ సమయం కూడా పెరుగుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు