సీఎన్‌జీ ధరలను తగ్గించండి

23 May, 2022 13:57 IST|Sakshi

కేంద్రానికి సియామ్‌ విజ్ఞప్తి  

న్యూఢిల్లీ: స్టీల్, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీకి వినియోగించే పలు మడి పదార్థాల దిగుమతులపై సుంకాలు తగ్గించాలని, సీఎన్‌జీ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సంఘం సియామ్‌ కోరింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపును ఆహ్వానించింది. ఈ నిర్ణయం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గిస్తుందని, అంతిమంగా సామాన్యుడికి ప్రయోజనం కలిగిస్తుందని సియామ్‌ తన ట్విట్టర్‌ పేజీలో ప్రకటించింది.

స్టీల్, ప్లాస్టిక్‌ తయారీకి సంబంధించిన కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలు తగ్గించడంతోపాటు.. స్టీల్‌ ఇంటర్‌ మీడియట్స్‌పై సుంకాలు పెంచడం వల్ల దేశీ మార్కెట్లో స్టీల్‌ ధరలు మోస్తరు స్థాయికి దిగొచ్చేందుకు సాయపడుతుందని పేర్కొంది. గత ఏడు నెలల కాలంలో సీఎన్‌జీ ధరలు గణనీయంగా పెరిగినందున దీనిపైనా ఉపశమనం కల్పించాలని పరిశ్రమ కోరింది.  
 

చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రమాదాలు.. డీఆర్‌డీవో రిపోర్ట్‌లో షాకింగ్‌ విషయాలు

మరిన్ని వార్తలు