జస్ట్..రూ.99కే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన హెచ్‌ఎస్‌బీసీ!

13 Mar, 2023 15:27 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) కుప్ప కూలింది. ఇప్పుడు ఆ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఇతర దిగ్గజ బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్(uk) ప్రధాన కార్యాలయంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రఖ్యాత బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ..యూకేలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ యూకే లిమిటెడ్‌ను (Silicon Valley Bank UK Ltd) 1 పౌండ్‌ (భారత్‌ కరెన్సీలో రూ.99) కు కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో నోయల్ క్విన్ (Noel Quinn) తెలిపారు. ఈ కొనుగోలు యూకేలో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకింగ్‌ సేవలకు ఊతం ఇస్తుందని, ఎస్‌వీబీ కస్టమర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ఇంత తక్కువ ధరకు సొంతం చేసుకోనున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ సీఈవో ప్రకటన చేశారు. 

చదవండి👉 భారత్‌లో కలకలం..మరో బ్యాంక్‌ను మూసివేస్తున్నారంటూ రూమర్స్‌!

యూఎస్‌ రెగ్యులేటరీ ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీఐసీ) మూసి వేస్తున్నట్లు ప్రకటన చేయడం, ఆ తర్వాత  సుమారు 175 బిలియన్ డాలర్ల డిపాజిట్‌లను కాపాడుతున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ యూకే ను 1 ఫౌండ్‌కు సొంతం చేసుకోనున్నట్లు తెలుపుతూ.. ఓ ప్రకటన చేసింది.

ఆ స్టేట్మెంట్‌ ప్రకారం..యూకేలో ఎస్‌వీబీకి మార్చి 10 నాటికి మొత్తం 5.5 బిలియన్ పౌండ్ల రుణాలు, 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు, 1.4 బిలియన్ పౌండ్ల ఈక్విటీ ఉంటుందని అంచనా వేసింది. ఇక తమ కొనుగోలు ప్రకటనతో యూకేలో ఎస్‌వీబీ లావాదేవీలు కొనసాగుతాయి. ఇప్పటికే తమ బ్యాంకు(hsbc) అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించి.. ఎస్‌వీబీకి నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఎస్‌వీబీని ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తున్నారనే విషయాల గురించి వివరణ ఇవ్వలేదు.


చదవండి👉 ఐటీ ఉద్యోగుల్లో కొత్త భయాలు..ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు