టెక్కీలకు గడ్డుకాలం, వరస్ట్‌ ఇయర్‌గా 2022

1 Aug, 2022 20:06 IST|Sakshi

Tech companies fired over 32,000 employees : టెక్‌ దిగ్గజ కంపెనీ ఉద్యోగులకు భారీ షాకిచ్చాయి. ఒక్క జులై నెలలో సుమారు 32వేల మంది టెక్కీలపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు 2022 వరస్ట్‌ ఇయర్‌గా నిలిచిపోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి 

ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో గట్టెంకేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ జులై నెలలో అమెరికా సిలీకాన్‌ వ్యాలీలో కార్యకాలపాలు నిర్వహిస్తున్న ఆయా సంస్థలు మొత్తం 32 వేల మందిని విధుల నుంచి తొలగించాయని వెలుగులోకి వచ్చిన క్రంచ్‌ బేస్‌ నివేదిక పేర్కొంది. ఉద్యోగులపై వేటు విధించిన సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్‌, షాఫిఫై, కాయిన్‌ బేస్‌తో పాటు ఇతర కంపెనీలు వందల మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసినట్లు పేర్కొంది. 

వారం వారం పెరిగిపోతున్నారు. 
మా దృష్టికి వచ్చింది. సిలికాన్‌ వ్యాలీలో ఉన్న టెక్‌ కంపెనీలు వారం వారం ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అందుకే మాకు (క్రంచ్‌బేస్‌) ఏ ఉద్యోగం స్థిరంగా ఉండడం లేదని అనిపిస్తుంది. స్పష్టమైన కారణం లేకుండానే ఉద్యోగాలు కోల్పోతున్నందున చాలా మందికి 2022 మరో వరస్ట్‌ ఇయర్‌గా మారుతోంది. కొన్ని టెక్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియను నిలిపివేశాయి. ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు చాలా సంస్థలు ఉద్యోగల్ని తొలగిస్తున్నాయి. అమెరికాలో దాదాపు 64 ప్రముఖ టెక్ కంపెనీలు జూలై నెలలో 32వేల కంటే ఎక్కువ మంది విధుల నుంచి తొలగించాయని క్రంచ్‌ బేస్‌ హైలెట్‌ చేసింది.  

క్రంచ్‌బేస్ సేకరించిన డేటా ప్రకారం..ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ షాఫిఫై గత నెలలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో రిక్రూటింగ్, సపోర్ట్, సేల్స్ విభాగాల ఉద్యోగులున్నారు.   

ట్విట్టర్ తన టాలెంట్ అక్విజిషన్ టీమ్‌లో 30 శాతం మందిని తొలగించింది.పెరుగుతున్న వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. 

మైక్రోసాఫ్ట్ తన 1,80,000 మంది వర్క్‌ఫోర్స్‌లో 1 శాతాన్ని తగ్గించింది, కొన్ని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వ్యాపార అవసరాలను తీర్చాలని యోచిస్తోంది.

టిక్‌టాక్ కంపెనీ పునర్నిర్మాణం పేరుతో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించిందని,100 కంటే తక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వైర్డ్  నివేదిక పేర్కొంది. 

హూప్ వంటి ఇతర స్టార్టప్‌లు 15 శాతం మంది సిబ్బందిని తొలగించాయి. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ విమెమో (Vimeo) 72 మంది ఉద్యోగులను తొలగించింది. 

కేవలం రెండు నెలల్లో, నెట్‌ఫ్లిక్స్ మొత్తం 450 మంది పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించింది. సబ్‌స్క్రైబర్లు తగ్గడం, అదే సమయంలో ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

కాయిన్‌బేస్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు 1100 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. కంపెనీ సీఈవో బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదట ఉద్యోగుల తొలగింపుకు ఆర్ధిక పరిస్థితులేనని అన్నారు. ఆపై అవసరానికి మించి ఉద్యోగుల్ని హయ్యర్‌ చేసుకుందని మాట మార్చారు.

మరిన్ని వార్తలు